ANNAMAYYA KIRTHANA – అన్నమయ్య కీర్తన
ENNADU VIJNAANAMIKA NAAKU – ఎన్నడు విజ్ఞానమిక నాకు
పల్లవి
ఎన్నడు విజ్ఞానమిక నాకు
విన్నపమిదె శ్రీవేంకాటనాథ
ennaDu vijnAnamika nAku
vinnapamide SrIvEMkaaTanAtha
When do I get Wisdom
now!
Here is my appeal (to
You) O’ Venkatanatha!
[Natha=Lord;
O’ Lord Venkatesha]
చరణం 1
బాసిన బాయవు భవబంధములు
ఆస ఈ దేహమున్నన్నాళ్ళు
కోసిన తొలగవు కోరికలు
గాసిలి చిత్తము కలిగినన్నాళ్ళు
bAsina bAyavu BavabaMdhamulu
Asa I dEhamunnannALLu
kOsina tolagavu kOrikalu
gAsili cittamu kaliginannALLu
Parting does not unclasp
Worldy Attachments!
Desire till the body
exists!
Piecing does not eliminate
Wants!
Grief till the mind
exists!
చరణం 2
కొచ్చిన కొరయవు కోపములు
గచ్చుల గుణములు గలిగినన్న్నాళ్ళు
తచ్చిన తగలవు తహ తహలు
రచ్చల విషయపు రతులన్నాళ్ళు
koccina korayavu kOpamulu
gaccula guNamulu galiginannnALLu
taccina tagalavu taha tahalu
raccala viShayapu ratulannALLu
Chiseling does not lessen
Anger!
Till the arrogant attributes
exist!
Whipping do not seperate
Anxieties!
Till fussy affair of
lusts exist!
చరణం 3
ఒకటి కొకటికిని
ఒడబడవు
అకట శ్రీవేంకటాధిపుడా
సకలము నీవే శరణంటే ఇక
వికటము లణగెను వేడుక
నాళ్ళు
okaTi kokaTikini oDabaDavu
akaTa SrIvEMkaTAdhipuDA
sakalamu nIvE SaraNaMTE ika
vikaTamu laNagenu vEDuka nALLu
One does give in with the
other!
Alas! Lord Sri
Venkatesha!
You are the Whole, as I
surrender!
Conflicts surpassed! Days
Celebrated!
No comments:
Post a Comment